కొమురంభీమ్ జిల్లా, సిర్పూర్(టీ) మండలంలోని పారిగాం గ్రామం 7వ వార్డులో చేతి పంపు సరిగా పనిచేయకపోవడంతో ప్రజలు తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నారు. నీరు రావాలంటే పంపును పలుమార్లు ఊపాల్సి వస్తోందని, సమస్యపై అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. తాగునీటి వంటి మౌలిక సమస్యను పట్టించుకోకపోవడంపై గ్రామస్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వెంటనే చేతి పంపును మరమ్మతు చేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.