ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డివైఎఫ్ఐ) 46వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు రెబ్బెన మండలం రాంపూర్ గ్రామంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జిల్లా ఉపాధ్యక్షుడు చాపిడి పురుషోత్తం మాట్లాడుతూ, డివైఎఫ్ఐ యువత సమస్యల పరిష్కారం, విద్య, వైద్యం, ఉపాధి, సామాజిక న్యాయం కోసం కృషి చేస్తోందని తెలిపారు. బీజేపీ ప్రభుత్వం యువతకు ఉద్యోగాల కల్పనలో విఫలమైందని, జిల్లాలో పరిశ్రమలు ఏర్పాటు చేయాలని, రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగ భృతి, జాబ్ క్యాలెండర్ విడుదల చేయలేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.