కొమురం భీం వర్ధంతికి పకడ్బందీ ఏర్పాట్లు: కలెక్టర్ ఆదేశాలు

2చూసినవారు
కొమురం భీం వర్ధంతికి పకడ్బందీ ఏర్పాట్లు: కలెక్టర్ ఆదేశాలు
కొమురం భీం జిల్లా, ఆసిఫాబాద్, సిర్పూర్‌లలో కొమురం భీం 86వ వర్ధంతి కార్యక్రమాన్ని ఈ నెల 26న ఘనంగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ కె. హరిత, ఐటీడీఏ పీఓ మంద మకరందు అధికారులను ఆదేశించారు. శనివారం జోడేఘాట్‌లో ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించిన కలెక్టర్, తాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్యం, వైద్యం, రవాణా, పార్కింగ్, భద్రత, ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. గిరిజన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రాధాన్యతనిస్తూ అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్