
పీఎం కిసాన్ యోజన సాయం పెంచే యోచనలో కేంద్రం?
కేంద్ర బడ్జెట్లో రైతులకు శుభవార్త అందనున్నట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన మొత్తాన్ని పెంచాలని పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం కేంద్రం రైతులకు ఏడాదికి ఒక ఎకరాకు రూ.6 వేలు మూడు విడతల్లో అందజేస్తోంది. ఈ సాయన్ని రూ.6,000 నుండి రూ.9,000 లేదా అంతకంటే ఎక్కువగా పెంచే యెచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. రేపు ప్రవేశపెట్టే వార్షిక బడ్జెట్తో క్లారిటీ రానుంది.




