నేటి నుంచి రైతు భరోసా నిధుల విడుదల: మంత్రి

0చూసినవారు
నేటి నుంచి రైతు భరోసా నిధుల విడుదల: మంత్రి
రైతు భరోసా నిధులు నేటి నుంచి విడుదల చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. మంగళవారం 2 ఎకరాల వరకు రైతుభరోసా నిధులు విడుదల చేస్తామని చెప్పారు. మిగతావారికి దశలవారీగా నిధులు జమ చేస్తామన్నారు. తొలివిడతలో 41.37లక్షల మంది రైతులకు రైతుభరోసా చెల్లించనున్నారు. రైతుల ఖాతాల్లో రూ.2,482 కోట్లు విడుదల చేస్తామని ప్రకటించారు. కొత్తగా పాసుబుక్‌లు వచ్చిన వారు జులై 5లోపు దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్