హోటళ్లు, రెస్టారెంట్ల యజమానులకు ఫైర్ ఆఫీసర్ హెచ్చరిక

505చూసినవారు
హోటళ్లు, రెస్టారెంట్ల యజమానులకు ఫైర్ ఆఫీసర్ హెచ్చరిక
కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో వేసవిలో అగ్ని ప్రమాదాల నేపథ్యంలో, హోటళ్లు, రెస్టారెంట్ల యజమానులు అప్రమత్తంగా ఉండాలని ఫైర్ ఆఫీసర్ భీమయ్య హెచ్చరించారు. మంగళవారం పట్టణంలోని పలు హోటళ్లలో నిర్వహించిన అవగాహన సదస్సులో, వంటగదుల్లో గ్యాస్ లీకేజీలు, విద్యుత్ వైరింగ్ తనిఖీలు, ఫైర్ ఎక్స్‌టింగ్విషర్ల లభ్యత, సిబ్బందికి వాటి వాడకంపై అవగాహన, అత్యవసర నిర్గమన ద్వారాలు ఖాళీగా ఉంచడం వంటి అంశాలపై సూచనలు చేశారు. నిబంధనలు పాటించని వారిపై చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్