వాంకిడి మండల కేంద్రంలోని
కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ ప్రధానమంత్రి, ప్రముఖ ఆర్థికవేత్త డాక్టర్ మన్మోహన్ సింగ్ జయంతి వేడుకలను
కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. మండల
కాంగ్రెస్ అధ్యక్షుడు గుర్నులే మేంగాజీ ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. దేశ ఆర్థిక వ్యవస్థకు మన్మోహన్ సింగ్ అందించిన సేవలను నాయకులు స్మరించుకున్నారు. కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు కడప మారుతి, సెల్వాట్కర్ పెంటు, టౌన్ ప్రెసిడెంట్ ధన్వల్కర్ కమలేష్ బంటి, వర్కింగ్ ప్రెసిడెంట్ డికొండ మహేష్, మండల అధ్యక్షుడు చునర్కర్ శివాజీ, సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.