
ఎన్నికలకు ముందు ‘ఉచిత’ హామీలపై పిల్.. విచారణకు సుప్రీం అంగీకారం
ఎన్నికల్లో ఓటర్లను ఆకర్షించేందుకు రాజకీయ పార్టీలు ఇచ్చే ఉచిత హామీలకు వ్యతిరేకంగా దాఖలైన పిల్‌ను విచారించేందుకు సుప్రీం కోర్టు అంగీకరించింది. న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ దాఖలు చేసిన ఈ పిల్‌లో, అసంబద్ధమైన ఉచిత హామీలు ఇచ్చే పార్టీల గుర్తులు, రిజిస్ట్రేషన్‌లను రద్దు చేయాలని కోరారు. ఆచరణ సాధ్యం కాని వాగ్దానాలు ఎన్నికల ప్రక్రియ స్వచ్ఛతను దెబ్బతీస్తాయని, దీనిపై చట్టం రూపొందించాలని కేంద్రాన్ని ఆదేశించాలని పిటిషనర్ కోరారు. ఈ తీవ్రమైన సమస్యపై మార్చి చివరిలో విచారణ జరపాలని ధర్మాసనం అంగీకరించింది.




