కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం బుసిమెట్టలోని గిరిజన గురుకుల జూనియర్ కళాశాలలో ప్రహరీ గోడ నిర్మాణానికి ఎమ్మెల్యే కోవ లక్ష్మి సోమవారం శంకుస్థాపన చేశారు. గిరిజన విద్యార్థుల విద్య, భద్రతకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని, పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్, సర్పంచ్, ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్థులు పాల్గొన్నారు.