ఆసిఫాబాద్ జిల్లాలో ఫౌండేషనల్ లెర్నింగ్ స్టడీపరీక్షలు సక్సెస్

3చూసినవారు
ఆసిఫాబాద్ జిల్లాలో ఫౌండేషనల్ లెర్నింగ్ స్టడీపరీక్షలు సక్సెస్
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఫౌండేషనల్ లెర్నింగ్ స్టడీ–2026 పరీక్షలు విజయవంతంగా ముగిశాయి. ఎంపికైన 23 ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో 3వ తరగతికి చెందిన 229 మంది విద్యార్థులు ట్యాబుల ద్వారా ఆన్లైన్ పరీక్షలు రాశారు. చదవడం, వ్రాయడం, గణిత నైపుణ్యాలను అంచనా వేయడం ఈ పరీక్షల ముఖ్య ఉద్దేశ్యం. మండల విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయుల సమన్వయంతో పరీక్షలు పారదర్శకంగా జరిగాయి. ఫలితాల ఆధారంగా విద్యార్థుల లోపాలను గుర్తించి చర్యలు తీసుకుంటామని డీఈఓ లలిత తెలిపారు. పరీక్షల నిర్వహణలో పాల్గొన్న అధికారులను ఆమె అభినందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్