మామిడి నరేందర్ మాస్టర్‌కు గద్దరన్న మెమోరియల్ అవార్డు ప్రదానం

0చూసినవారు
మామిడి నరేందర్ మాస్టర్‌కు గద్దరన్న మెమోరియల్ అవార్డు ప్రదానం
తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా, కొమురంభీం జిల్లాలో నృత్య కళారంగ అభివృద్ధికి విశేష కృషి చేసిన ప్రముఖ నృత్య గురువు మామిడి నరేందర్ మాస్టర్ ను మోక్షిత డాన్స్ అకాడమీ మరియు సేవా సమితి ఆధ్వర్యంలో గద్దర్ అన్న మెమోరియల్ అవార్డుతో ఘనంగా సత్కరించారు. జిల్లాలో మొట్టమొదటిసారిగా నృత్య అకాడమీని స్థాపించి, ఎంతోమంది కళాకారులను తీర్చిదిద్దిన నరేందర్ మాస్టర్ సేవలను గుర్తిస్తూ ఈ అవార్డును ప్రదానం చేశారు. ప్రముఖ నృత్య కళాకారుడు డోంగ్రి సంతోష్ చేతుల మీదుగా అవార్డును అందజేశారు. తన కళా సేవలను గుర్తించి గౌరవించినందుకు మామిడి నరేందర్ మాస్టర్ మోక్షిత డాన్స్ అకాడమీ, సేవా సమితి సభ్యులకు, అలాగే డోంగ్రి సంతోష్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

ట్యాగ్స్ :