తెలంగాణ మున్నూరు కాపు సంఘం (పటేల్స్) రాష్ట్ర అధ్యక్షుడు కొండ దేవయ్య పటేల్ సమక్షంలో ఆదివారం ఆసిఫాబాద్ జిల్లా మున్నూరు కాపు సంఘం నూతన జిల్లా కమిటీని ఏర్పాటు చేశారు. గజ్జల లక్ష్మణ్ జిల్లా అధ్యక్షుడిగా, అనిశెట్టి సదాశివ్ ప్రధాన కార్యదర్శిగా, మిట్ట దేవేందర్ కోశాధికారిగా ఎన్నికయ్యారు. బొలిశెట్టి మహేష్‌తో పాటు పలువురు నాయకులను జిల్లా ఉపాధ్యక్షులుగా నియమించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు నూతన కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, సంఘ బలోపేతం, మున్నూరు కాపు సమాజ ఐక్యత, అభివృద్ధి కోసం సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.