కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా శుక్రవారం జిల్లా
కాంగ్రెస్ కమిటీ కార్యాలయంలో కార్యక్రమం జరిగింది. ఆసిఫాబాద్ నియోజకవర్గ
కాంగ్రెస్ ఇంచార్జి అజ్మీరా శ్యామ్ నాయక్ గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. గాంధీజీ అహింస, సత్యాగ్రహం, శాంతి మార్గంలో చేసిన పోరాటాన్ని, దేశానికి అందించిన సేవలను నాయకులు స్మరించుకున్నారు. గాంధీజీ ఆశయాలు, సిద్ధాంతాలు నేటి సమాజానికి మార్గదర్శకమని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అనిల్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మంగ, డీసీసీ అధ్యక్షురాలు అత్రం సుగుణ, మాజీ డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్ పాల్గొన్నారు.