గంగాపూర్ జాతర.. భారీ బందోబస్తుకు ఎస్పీ నితికా పంత్ ఆదేశాలు

0చూసినవారు
గంగాపూర్ జాతర.. భారీ బందోబస్తుకు ఎస్పీ నితికా పంత్ ఆదేశాలు
కొమరం భీం ఎస్పీ నితికా పంత్, రెబ్బెన మండలం గంగాపూర్ గ్రామంలో జరగనున్న గంగాపూర్ జాతర సందర్భంగా పోలీస్ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. శుక్రవారం నిర్వహించిన ప్రత్యేక డ్యూటీ సమావేశంలో, భారీగా హాజరయ్యే భక్తుల దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జాతరకు 282 మంది పోలీస్ అధికారులు, సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్