
ఫిబ్రవరి 2026 బ్యాంక్ సెలవుల వివరాలివే
ఫిబ్రవరి 2026లో బ్యాంకుల పనిదినాలు సెలవులను ప్రకటించారు. ఫిబ్రవరి 15న మహాశివరాత్రి, ఆదివారం కారణంగా ఢిల్లీ, యూపీ, బీహార్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఏపీ సహా అన్ని రాష్ట్రాల్లో బ్యాంకులు బంద్. ఫిబ్రవరి 18న లోసర్ పండుగ సందర్భంగా సిక్కింలో, ఫిబ్రవరి 19న ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా మహారాష్ట్రలో, ఫిబ్రవరి 20న రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా మిజోరం, అరుణాచల్ ప్రదేశ్లలో బ్యాంకులు పనిచేయవు. అయితే, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఏటీఎం సేవలు యధావిధిగా అందుబాటులో ఉంటాయి.




