కొమరంభీం జిల్లా, ఆసిఫాబాద్‌లోని బంబారా గ్రామపంచాయతీలో మంగళవారం జనరల్ బాడీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో గ్రామ అభివృద్ధి, పారిశుద్ధ్య నిర్వహణపై చర్చించారు. సర్పంచ్ బెండారే కృష్ణాజి మల్టీపర్పస్ వర్కర్లకు సెప్టిక్ క్యాప్స్, షూస్, గ్లౌజులు, షర్టులను అందజేశారు. గ్రామ పారిశుద్ధ్యం, ప్రజల ఆరోగ్య పరిరక్షణలో కార్మికుల సేవలు కీలకమని, వారి భద్రత కోసం రక్షణ సామగ్రి అందించడం తమ బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్, కార్యదర్శి, వార్డు సభ్యులు పాల్గొన్నారు.