వాంకిడి పాటగూడలో గోండు జానపద గీతం 'సియాన సాత్ మేరా' చిత్రీకరణ

610చూసినవారు
వాంకిడి పాటగూడలో గోండు జానపద గీతం 'సియాన సాత్ మేరా' చిత్రీకరణ
కొమరంభీం జిల్లా, ఆసిఫాబాద్‌లోని వాంకిడి మండలంలో ఆదివాసీల జీవనశైలి, సంస్కృతిని ప్రతిబింబించేలా 'సియాన సాత్ మేరా' అనే గోండు జానపద గీతం చిత్రీకరణ శనివారం, జూన్ 28న పాటగూడ గ్రామంలో జరిగింది. కోయరాణి ప్రొడక్షన్ యూట్యూబ్ ఛానల్ కోసం రూపొందిస్తున్న ఈ పాట, ఆదివాసీల ఆచార వ్యవహారాలను, సహజత్వాన్ని కళ్లకు కట్టేలా ప్రకృతి నేపథ్యంలో చిత్రీకరించారు. మెగ్ రాజ్ మేస్రం దర్శకత్వం వహించి, సంగీతం అందించారు. గోండు భాషకు గుర్తింపు కల్పించడమే దీని ఉద్దేశ్యం.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్