కొమరం బీమ్ ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలంలోని లంబాడిహెట్టి నుండి గుడుంబా రవాణా చేస్తున్నారన్న సమాచారంతో వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో 20 లీటర్ల నాటుసారాయి (గుడుంబా)తో పాటు, దానిని తరలిస్తున్న ఆటోను, ఒక మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. లంబాడిహెట్టి గ్రామానికి చెందిన లావుడె రవిపై కేసు నమోదు చేసినట్లు కాగజ్ నగర్ ఇంచార్జి ఎక్ససైజ్ సీఐ పి.లోభానంద్ తెలిపారు. ఈ దాడులలో ఎస్.ఐ. ఐ.సురేష్, ట్రైనీ ఎస్.ఐ. కె.సుచరిత, సిబ్బంది పాల్గొన్నారని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.