
ఓటర్ల జాబితా సవరణపై అప్రమత్తంగా ఉండాలి: సజ్జల
తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో SIR (ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్) పై సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వైసీపీ నేత, మాజీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి మాట్లాడుతూ, ఓటర్ల జాబితా సవరణపై అప్రమత్తంగా ఉండాలని పార్టీ శ్రేణులకు సూచించారు. SIR పేరుతో అధికార పక్షం చేసే అవకతవకలు, అక్రమాలను అడ్డుకోవాలని, ఓట్లు తీసివేయకుండా, అక్రమ ఓట్లు చేర్చకుండా చాలా జాగ్రత్త పడాలని ఆయన అన్నారు.




