ఆసిఫాబాద్‌లోని వాంకిడి మండలంలోని సోనాపూర్ గ్రామపంచాయతీ పరిధి చిచ్చుపల్లి గ్రామంలో ఆదివారం ఉల్లాస్
పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలకు పలువురు పరీక్షార్థులు హాజరయ్యారు. పరీక్షా కేంద్రాన్ని వాంకిడి ఎంపీడీవో జ్యోత్స్నా పాటిల్, సీసీ జాడే, వేణుగోపాల్ సందర్శించి,
పరీక్షలు ప్రశాంతంగా జరిగేలా సిబ్బందికి సూచనలు చేశారు. నిరక్షరాస్యుల్లో అక్షరాస్యత పెంపొందించేందుకు ప్రభుత్వం చేపడుతున్న ఉల్లాస్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు. కార్యక్రమంలో స్థానిక సిబ్బంది, వీఓఏ శంకరమ్మ, బొజ్జిరావు పెట్కార్ కిరణ్, గ్రామస్తులు పాల్గొన్నారు.