సిర్పూర్, ఆసిఫాబాద్‌లో ప్రైవేటు పాఠశాలలు ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయని, పేరెంట్స్ కమిటీలు నియమించకుండా, ఫీజుల ధరల పట్టికలు ప్రదర్శించకుండా విద్యార్థుల తల్లిదండ్రులను దోపిడీ చేస్తున్నాయని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డివైఎఫ్ఐ) ఆరోపించింది. ఈ విషయమై కాగజ్‌నగర్ మండల విద్యాధికారి వసాల ప్రభాకర్‌కు డీవైఎఫ్ఐ నాయకులు గోడిసెల కార్తీక్, గేడం టికనంద్ వినతి పత్రం సమర్పించారు. పాఠశాలల్లో షూ, బెల్ట్, టై, నోట్‌బుక్స్, యూనిఫాం, పాఠ్యపుస్తకాలను విచ్చలవిడిగా విక్రయిస్తున్నారని పేర్కొన్నారు.