కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ క్యాంపు కార్యాలయంలో హోలీ పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో జిల్లా ఎస్పీ నితిక పంత్ పాల్గొని పోలీస్ అధికారులు, సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. హోలీ ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందం, కొత్త వెలుగును నింపాలని ఆమె ఆకాంక్షించారు. విధుల్లో నిమగ్నమై ఉండే సిబ్బందికి ఇటువంటి వేడుకలు మానసిక ఉల్లాసాన్ని, పరస్పర ఐక్యతను పెంపొందిస్తాయని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్స్పెక్టర్లు, ఎస్‌ఐలు, ఆర్‌ఎస్‌ఐలు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.