కొమురం భీం జిల్లా వాంకిడి మండల కేంద్రంలోని ఇందిరానగర్ కు పదేళ్ల క్రితం వచ్చిన జార్ఖండ్ వాసి రాజు ఇటంకర్, స్థానికుడి ఇంట్లో ఉంటూ వ్యవసాయ పనులు చేసేవాడు. నిన్న రాత్రి గుండెపోటుతో మరణించిన రాజు మృతదేహాన్ని వాంకిడికి తరలించి, ఇందిరానగర్ వాసులు దశరథ్, రమేష్, మారుతీ తదితరులు కలిసి అంత్యక్రియలు నిర్వహించి మానవత్వం చాటుకున్నారు.