సీనియర్ జాతీయ నెట్‌బాల్ పోటీలకు ఆదర్శ విద్యార్థినీ ఎంపిక

1చూసినవారు
సీనియర్ జాతీయ నెట్‌బాల్ పోటీలకు ఆదర్శ విద్యార్థినీ ఎంపిక
కొమురం భీమ్ జిల్లా కేంద్రంలోని ఆదర్శ పాఠశాల, కళాశాలలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సీఈసీ చదువుతున్న బొట్టుపల్లి సాయి దీక్ష, 43వ సీనియర్ నేషనల్ నెట్‌బాల్ అసోసియేషన్ చాంపియన్‌షిప్‌కు ఎంపికయ్యారు. ఈ జాతీయస్థాయి పోటీలు ఈ నెల 11 నుంచి 14 వరకు హైదరాబాద్‌లోని గచ్చిబౌలి జీఎంసీ ఇండోర్ స్టేడియంలో జరగనున్నాయి. సాయి దీక్ష ఎంపికపై కళాశాల ప్రిన్సిపల్, అధ్యాపకులు, ఫిజికల్ డైరెక్టర్, నెట్‌బాల్ జిల్లా అధ్యక్షులు ఆమెను అభినందించారు.

ట్యాగ్స్ :