లింగాపూర్ జాతరలో అక్రమ లాటరీ ఆట – ఇద్దరి అరెస్ట్ –, ఎస్పీ

0చూసినవారు
లింగాపూర్ గ్రామం మరియు మండల పరిధిలో శుక్రవారం మధ్యాహ్నం జరిగిన లింగాపూర్ జాతరలో అక్రమంగా లాటరీ ఆట ఆడుతున్న ఇద్దరిని సీసీఎస్ (CCS) బృందం అదుపులోకి తీసుకుంది. అరెస్ట్ అయిన వారిలో ఆదే అర్వింద్, చవాన్ శివ ఉన్నారు. వారి వద్ద నుంచి లాటరీ గేమ్ షీట్, 12 పాచికలు, 2 స్టీల్ బౌల్స్, నగదు రూ. 3, 240 స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న సామగ్రిని లింగాపూర్ పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు. అక్రమ జూదం, లాటరీ ఆటలపై కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ నితికా పంత్ హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్