
ఏపీ జెన్కోలో 100 ఉద్యోగాలు.. రూ.2 లక్షల జీతం
ఇంజినీరింగ్ పూర్తి చేసిన అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (APGENCO) 100 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (AEE) పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హత కలిగిన అభ్యర్థులు జూన్ 30, 2026 నుంచి జులై 20, 2026 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. BE/B.Tech/AMIE లేదా సమాన అర్హత కలిగిన 18 నుంచి 42 ఏళ్ల మధ్య వయస్సు గలవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైనవారికి రూ.2 లక్షల జీతం లభించనుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) ద్వారా ఎంపిక జరుగుతుంది.




