
తొక్కిసలాటలో 40 మంది మృతి.. విజయ్ అరెస్ట్ తప్పదా?
తమిళనాడులోని కరూర్‌లో TVK అధ్యక్షుడు విజయ్ ర్యాలీలో జరిగిన తొక్కిసలాటలో మృతుల సంఖ్య భారీగా పెరిగింది. ఇప్పటి వరకు 40 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. మృతుల్లో ఆరుగురు చిన్నారులు ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనతో హీరో విజయ్ ను అరెస్ట్ చేస్తారా? అనే ప్రచారం జోరుగా జరుగుతోంది. కాగా, 'పుష్ప-2' రిలీజ్ వేళలో జరిగిన తొక్కిసలాటలో అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.




