కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఉద్యాన, వాణిజ్య పంటల సాగును పెంపొందించేందుకు రైతులను ప్రోత్సహించాలని గురువారం కమిషన్ ఆఫ్ హార్టికల్చర్, జిల్లా ప్రత్యేక అధికారి అజ్మీర ప్రేమ్ సింగ్ సూచించారు. రైతులకు పండ్ల తోటలు (మామిడి, జామ, నిమ్మ, డ్రాగన్ ఫ్రూట్), ఆయిల్ ఫామ్ తోటలు, కూరగాయలు, పూల తోటలు, పప్పు ధాన్యాలపై అవగాహన కల్పించాలన్నారు. ప్రభుత్వం తరఫున పలు రాయితీలు అందిస్తున్నట్టు తెలిపారు.