రెబ్బెన మండల కేంద్రంలో అజ్మెర శ్రీనివాస్–రాజేశ్వరి దంపతుల నూతన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా అర్హులైన ప్రతి పేద కుటుంబానికి సొంత ఇల్లు కల్పించాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించారని తెలిపారు. పారదర్శకంగా, రాజకీయ పక్షపాతం లేకుండా నిజమైన లబ్ధిదారులకు ఇళ్లు అందజేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మోడెం సుదర్శన్ గౌడ్, మోడెం చిరంజీవి గౌడ్, దుర్గం రాజేష్, గొడిసెల భార్గవ్ గౌడ్, అజ్మెరా అశోక్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.