తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకు అందించే ఇందిరమ్మ ఇళ్ల పథకంలో అర్హత గల లబ్ధిదారుల పేర్లు మాత్రమే ఉండాలని కొమరంభీం ఆసిఫాబాద్ కలెక్టర్ వెంకటేశ్ దౌత్రే అన్నారు. గురువారం ఆసిఫాబాద్ లోని ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో పేరు గల సాహెరా బేగం ఇంటిని సందర్శించి దరఖాస్తుదారు వివరాలు అడిగి తెలుసుకున్నారు. లబ్ధిదారులు సొంత ఇంటి స్థలం కలిగి ఉండాలని, నిబంధనల ప్రకారం 600చదరపు అడుగులలోపు నిర్మాణం చేపట్టాలని సూచించారు.