
పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య కేసు.. వీడని మిస్టరీ!
TG: చర్లపల్లిలో సాఫ్ట్వేర్ ఉద్యోగి విజయారెడ్డి తన పిల్లలతో సహా రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న ఘటనలో మిస్టరీ ఇంకా వీడలేదు. పోలీసులు ఆమె వాట్సాప్ రికార్డ్స్ పరిశీలించగా, ఎలాంటి అనుమానాస్పద అంశాలు లభించలేదని తెలుస్తోంది. ఆర్థిక ఇబ్బందులు లేవని, నెలకు లక్ష రూపాయల వరకు జీతం, అద్దెలు, దుబాయ్ లో ఉన్న భర్త జీతం కూడా ఆమె ఖాతాకే వస్తున్నాయని సమాచారం. అయినప్పటికీ, ఆమె ఈ అఘాయిత్యానికి ఎందుకు పాల్పడిందనే దానిపై స్పష్టత లేదు.




