
లోయలో పడ్డ ఆటో.. నలుగురు మృతి
AP: మన్యం జిల్లాలోని జంపరకోట దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ఆటో ప్రమాదవశాత్తూ అదుపుతప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా.. ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతులు సీతంపేటకు చెందిన గిరిజనులుగా గుర్తించారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.




