బియ్యం దుకాణాలు, రిలయన్స్ స్మార్ట్ పాయింట్‌లో తనిఖీలు

0చూసినవారు
బియ్యం దుకాణాలు, రిలయన్స్ స్మార్ట్ పాయింట్‌లో తనిఖీలు
కాగజ్‌నగర్‌ పట్టణంలోని గోల్ బజార్‌లో పౌరసరఫరాలు, లీగల్ మెట్రాలజీ, మున్సిపల్ శాఖల అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. 26 కిలోలుగా ముద్రించిన బియ్యం బస్తాల్లో 25 కిలోలే ఉండటంతో పాటు తూనికలు, లైసెన్సుల నిబంధనల ఉల్లంఘనలు గుర్తించారు. సతీష్, రవికుమార్, బుక్క రాములు, పండరినాథ్ దుకాణాలపై చర్యలకు సిద్ధమయ్యారు. రిలయన్స్ స్మార్ట్ పాయింట్‌లోనూ తూనిక యంత్రంలో వ్యత్యాసాలు గుర్తించి కేసులు నమోదు చేశారు. తనిఖీల్లో డీసీఎస్ఓ వాజిద్ అలీ తదితర అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్