గంగాపూర్ జాతరకు వేళాయే

251చూసినవారు
గంగాపూర్ జాతరకు వేళాయే
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం గంగాపూర్ గ్రామ శివారులోని శ్రీ బాలాజీవెంకటేశ్వర స్వామి జాతర కోసం ఆలయం ముస్తాబయింది. ఈనెల 31, 1, 2 తేదీల్లో మూడు రోజుల పాటు జరగనున్న ఈ జాతరకు ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలతో పాటు మహారాష్ట్ర నుండి వేలాది మంది భక్తులు వస్తారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికార యంత్రాంగం, పోలీస్ శాఖ పటిష్ట భద్రతా చర్యలు చేపట్టింది. ఆలయ కమిటీ సభ్యులు విద్యుత్ దీపాలతో ఆలయాన్ని అలంకరించారు. ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులను నడిపించనున్నారు.

సంబంధిత పోస్ట్