సాంఘిక సంక్షేమ శాఖ జిల్లా అధికారిగా జాదవ్ అంబాజీ బాధ్యతలు స్వీకరణ

0చూసినవారు
సాంఘిక సంక్షేమ శాఖ  జిల్లా అధికారిగా జాదవ్ అంబాజీ బాధ్యతలు స్వీకరణ
కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ జిల్లా అధికారిగా గిరిజన సంక్షేమ శాఖ ఉపసంచాలకులు జాదవ్ అంబాజీ అదనపు బాధ్యతలు స్వీకరించారు. జిల్లా కలెక్టర్ కె. హరిత ఆదేశాల మేరకు బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా శాఖ అధికారులు, సిబ్బంది ఆయనను ఘనంగా సన్మానించి స్వాగతం పలికారు. అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా, విద్యార్థుల అభివృద్ధికి అంకితభావంతో కృషి చేస్తానని అంబాజీ తెలిపారు. కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్