జాబ్ మేళాకు విశేష స్పందన

0చూసినవారు
జాబ్ మేళాకు విశేష స్పందన
ప్రజాబంధు ఫౌండేషన్ ఆధ్వర్యంలో కాగజ్‌నగర్ లోని పటేల్ గార్డెన్స్‌లో నిర్వహించిన మెగా జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది. 10వ తరగతి నుంచి పీజీ, బీటెక్ వరకు చదివిన 1, 500 మందికి పైగా నిరుద్యోగులు హాజరయ్యారు. 45 కంపెనీల ప్రతినిధులు ఇంటర్వ్యూలు నిర్వహించగా, ఎంపికైన 300 మందికి సిర్పూర్ ఎమ్మెల్యే డా. పాల్వాయి హరీష్ బాబు ఆఫర్ లెటర్లు అందజేశారు. యువత నైపుణ్యాలు, కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.

సంబంధిత పోస్ట్