
ఇండిగో విమానాల షెడ్యూల్లో సర్దుబాటు!
విమానయాన సంస్థ ఇండిగో దూరప్రాంతాలకు వెళ్లే విమానాల షెడ్యూల్లో సర్దుబాట్లు చేస్తున్నట్లు ప్రకటించింది. ఫిబ్రవరి 17 నుంచి కోపెన్‌హాగన్‌కు విమాన సేవలను నిలిపివేస్తున్నట్లు తెలిపింది. ఢిల్లీ-లండన్ హీత్రూ, ఢిల్లీ-మాంచెస్టర్ మార్గాల్లోనూ విమానాల సంఖ్యను తగ్గిస్తున్నట్లు వెల్లడించింది. భౌగోళిక రాజకీయ పరిస్థితులు, మారుతున్న గగనతల పరిమితులు, విమానాశ్రయాల్లో రద్దీ వంటి సమస్యలే ఈ నిర్ణయానికి కారణమని సంస్థ పేర్కొంది.




