గిరిజన మహిళలకు జ్యూట్ శిక్షణ పూర్తి, స్వావలంబనకు పిలుపు

1113చూసినవారు
గిరిజన మహిళలకు జ్యూట్ శిక్షణ పూర్తి, స్వావలంబనకు పిలుపు
జైనూర్ మండలంలోని గూడమమడె గ్రామంలో గిరిజన మహిళలకు రెండు నెలలుగా నిర్వహిస్తున్న జ్యూట్ క్రాఫ్ట్ ట్రైనింగ్ సెంటర్ శిక్షణ విజయవంతంగా పూర్తయింది. శిక్షకురాలు తొడసం లక్ష్మి ఈ శిక్షణను అందించారు. శిక్షణ అనంతరం, సర్పంచ్ కుమ్రా దేవుసావ్ శిక్షకురాలిని శాలువాతో సన్మానించి, మహిళలు స్వావలంబన సాధించాలని పిలుపునిచ్చారు. ఈ శిక్షణ ద్వారా మహిళలు స్వయం ఉపాధి పొందేందుకు మార్గం సుగమం అయింది.

సంబంధిత పోస్ట్