రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మరో రెండు గంటల్లో వర్షం కురిసే అవకాశం ఉందని వెదర్ మ్యాన్ బాలాజీ పేర్కొన్నారు. ఈ మేరకు కొమరంభీం, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, రంగారెడ్డి, మంచిర్యాల జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షం కురుస్తుందని తెలిపారు. HYDలోని పలు ప్రాంతాల్లో సైతం తేలికపాటి నుండి మధ్యస్థంగా వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొన్నారు. ఎండల వేడితో, ఉక్కపోతతో తల్లడిల్లిపోతున్న ప్రజలకు ఈ వర్షసూచన చల్లనికబురు అనే చెప్పాలి.