ఆసిఫాబాద్ జిల్లా ఆదివాసీల హక్కుల కోసం జల్, జంగల్, జమీన్ నినాదంతో పోరాడిన కొమురం భీమ్ వర్ధంతి వారోత్సవాల ముగింపు కార్యక్రమాన్ని బుధవారం జిల్లా కేంద్రంలోని కుమురం భీమ్ చౌక్‌లో నిర్వహించారు. గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ జాదవ్ అంబాజీ విగ్రహానికి పూలమాలలు వేసి, ప్రత్యేక పూజలు నిర్వహించి జెండా ఆవిష్కరించారు. భీమ్ త్యాగాలు, పోరాట స్ఫూర్తిని స్మరించుకుంటూ ఆయన ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ, ఆదివాసీ సంఘాల నాయకులు, అధికారులు పాల్గొన్నారు.