
రేపటి నుంచి ఫాస్టాగ్ వార్షిక పాస్ ధర పెంపు!
ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఫాస్టాగ్ వార్షిక పాస్ ధరలు పెరగనున్నాయి. ప్రస్తుతం రూ.3 వేలుగా ఉన్న వార్షిక ఫీజు, రేపటి నుంచి రూ.3075కి పెంచాలని ఎన్హెచ్ఏఐ నిర్ణయించింది. ఈ పెంపుతో వాహనదారులపై స్వల్పంగా అదనపు భారం పడనుంది. తరచూ రహదారులపై ప్రయాణించేవారు కొత్త ఆర్థిక సంవత్సరానికి తమ పాస్‌ను రెన్యూవల్ చేసుకునే ముందు ఈ మార్పులను గమనించాలి. వార్షిక పాస్ తో 200 టోల్ క్రాసింగ్‌లు లభిస్తాయి. ఇది యాక్టివేట్ చేసుకున్న రోజు నుంచి ఏడాది పాటు చెల్లుబాటు అవుతుంది.




