కొమరంభీం జిల్లా, ఆసిఫాబాద్‌లోని వాంకిడిమండల కేంద్రంలోని జేత్వాన్ బుద్ధ విహార్‌లో సోమవారం స్వాతంత్ర్య సమరయోధుడు ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ 14వ వర్ధంతిని లక్ష్మణ్ సేవా సదన్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం బుద్ధ విహార్ పరిసర ప్రాంతాల్లో అరటిపండ్లు పంపిణీ చేశారు. సొసైటీ చైర్మన్ గాదే అవినాష్ మాట్లాడుతూ బాపూజీ సేవలు, ప్రజా ఉద్యమాలు స్ఫూర్తిదాయకమని, ఆయన ఆశయాలను కొనసాగిస్తూ ఏటా ప్రజాసేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.