కొమరంభీం జిల్లా, ఆసిఫాబాద్‌లోని వాంకిడి మండల కేంద్రంలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్ బాపూజీ 111వ జయంతి వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన వాంకిడి సర్పంచ్ చునార్కర్ సతీష్ బాపూజీ చిత్రపటానికి నివాళులర్పించారు. సంఘం అధ్యక్షుడు ఒడ్డపేల్లి సతీష్ మాట్లాడుతూ బాపూజీ బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి చేసిన సేవలు, పోరాటాలు స్ఫూర్తిదాయకమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, సభ్యులు పాల్గొన్నారు.