ఘనంగా కొండా లక్ష్మణ్‌ బాపూజీ జయంతి వేడుకలు

0చూసినవారు
ఘనంగా కొండా లక్ష్మణ్‌ బాపూజీ జయంతి వేడుకలు
కొమరంభీం జిల్లా, ఆసిఫాబాద్‌లోని వాంకిడి మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని ఆదివారం ఘనంగా నిర్వహించారు. మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గుర్నూలే మేంగాజీ ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మేంగాజీ మాట్లాడుతూ, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి బాపూజీ చేసిన సేవలు, సమాజం కోసం సాగించిన పోరాటాలు చిరస్మరణీయమని కొనియాడారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు సెల్వడ్కర్‌ పెంటు, కొడప్పే మారుతి, ధల్మల్కర్‌ కమలేష్‌ బంటి, చునార్కర్‌ శివాజీ, జాబురె గణేష్‌, కోట్రంగే మేంగాజీ, ఉప్రే ధర్మాజీ, చాన్‌ పాషా తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్