కొమరంభీం జిల్లా, ఆసిఫాబాద్‌లోని వాంకిడి మండల కేంద్రంలో ఆదివారం
కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బడుగు, బలహీన వర్గాల నాయకుడు కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. మండల
కాంగ్రెస్ అధ్యక్షుడు గుర్నూలే మేంగాజీ, బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన సేవలు, పోరాటాలు చిరస్మరణీయమని మేంగాజీ అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు
కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.