ఆసిఫాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో శనివారం స్వాతంత్ర్య సమరయోధుడు, తెలంగాణ ఉద్యమ పితామహుడు కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లా ఎస్పీ కాంతిలాల్ పాటిల్, ఐపీఎస్ బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. 1915లో ఆసిఫాబాద్ వాంకిడి గ్రామంలో జన్మించిన ఆయన విలువలు పోలీస్ శాఖకు మార్గదర్శకాలని ఎస్పీ తెలిపారు. కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది పాల్గొని పుష్పాంజలి ఘటించారు.