కరీంనగర్ మారథాన్‌లో పాల్గొన్న కుమురం భీమ్ ఆసిఫాబాద్ పోలీసులు

2చూసినవారు
కరీంనగర్ మారథాన్‌లో పాల్గొన్న కుమురం భీమ్ ఆసిఫాబాద్ పోలీసులు
కరీంనగర్ జిల్లాలో జరిగిన 21 కిలోమీటర్ల మారథాన్‌లో కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా పోలీస్ శాఖకు చెందిన ఎస్‌బీ ఇన్‌స్పెక్టర్ జి. సతీష్, పోలీస్ కానిస్టేబుళ్లు బి. రవి, ఎం. సాయి, వినేష్ పాల్గొన్నారు. క్రీడలు, శారీరక దారుఢ్యం, ఆరోగ్యంపై అవగాహన పెంపొందించే కార్యక్రమాల్లో పోలీస్ సిబ్బంది చురుకుగా పాల్గొనడం అభినందనీయమని జిల్లా ఎస్పీ నితికా పంత్ ఆదివారం అన్నారు. మారథాన్‌లో పాల్గొన్న సతీష్, రవి, సాయి, వినేష్‌లను ఎస్పీ అభినందించారు. భవిష్యత్తులోనూ ఇలాంటి క్రీడా కార్యక్రమాల్లో పాల్గొని ఆరోగ్యాన్ని, శారీరక దారుఢ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్