సూర్దాపూర్‌లో లడ్డూ వేలం

11చూసినవారు
సూర్దాపూర్‌లో లడ్డూ వేలం
కొమరంభీం జిల్లా, ఆసిఫాబాద్‌లోని కేరమేరి మండలం సూర్దాపూర్‌ గ్రామంలో వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన లడ్డూ వేలం పాటలో మొహర్లే సోమయ్య, తులసీబాయి దంపతులు రూ. 25,101కు లడ్డూను దక్కించుకున్నారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు, పటేల్‌ ఆదే శేషరావు, సెల్వతో పాటు గ్రామస్తులు దంపతులను ఘనంగా సత్కరించారు. వేలం కార్యక్రమంలో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని సందడి చేశారు. ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయని నిర్వాహకులు తెలిపారు.

సంబంధిత పోస్ట్