కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండల కేంద్రంలోని నాబార్డు గోదాంలో మక్కజొన్న కొనుగోలు కేంద్రం, సాండ్‌గాం గ్రామంలో వరి కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులకు మద్దతు ధర కల్పించేందుకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు సిర్పూర్ ఎమ్మెల్యే డా. పాల్వాయి హరీష్ బాబు తెలిపారు. మొక్కజొన్నకు రూ.2400 మద్దతు ధర లభించేలా చర్యలు తీసుకున్నామని, రైతులు దళారులను ఆశ్రయించకుండా ప్రభుత్వ కేంద్రాలను వినియోగించుకోవాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హరిత, ఎమ్మెల్సీ దండే విఠల్, వ్యవసాయ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.