మున్సిపల్ ఎన్నికల్లో సిపిఐ–సిపిఎం అభ్యర్థులను గెలిపించండి

3చూసినవారు
మున్సిపల్ ఎన్నికల్లో సిపిఐ–సిపిఎం అభ్యర్థులను గెలిపించండి
కొమురం భీం జిల్లా కేంద్రంలోని సీపీఎం పార్టీ కార్యాలయంలో శనివారం సీపీఐ, సీపీఎం నాయకుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి ఆత్మకూరి చిరంజీవి, సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దుర్గం దినకర్ మాట్లాడుతూ, నూతనంగా ఏర్పడ్డ ఆసిఫాబాద్ మున్సిపాలిటీ అభివృద్ధి కోసం తమ పార్టీల అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతున్న సీపీఐ–సీపీఎం అభ్యర్థులు 5, 10, 17, 18వ వార్డుల్లో పోటీ చేస్తున్నారని, వారిని అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో సీపీఐ నాయకులు బోయిరె ప్రకాష్, పిప్పిరి వెంకటేష్, సీపీఎం నాయకులు గొడిసెల కార్తిక్, వడ్లూరి మల్లేష్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్